FESTIVALS: వైభవంగా రథోత్సవాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:53 PM
మండలంలోని గ్రామదట్ల గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని శుక్రవారం గ్రా మపెద్దల ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఉద యాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్ద ల ఆధ్వర్యంలో రూ. 20 లక్ష లతో నూతన రథాన్ని తయా రు చేయించినట్లు గ్రామస్థు లు తెలిపారు.
రాయదుర్గంరూరల్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామదట్ల గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని శుక్రవారం గ్రా మపెద్దల ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఉద యాన్నే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్ద ల ఆధ్వర్యంలో రూ. 20 లక్ష లతో నూతన రథాన్ని తయా రు చేయించినట్లు గ్రామస్థు లు తెలిపారు. సాయంత్రం అందులో స్వామి ఉత్సవ వి గ్రహాన్ని ఉంచి మేళతాళాలు, డప్పు పురవీధుల్లో ఘంనగా ఊరేగించారు. గ్రామ సర్పంచ రాజశేఖర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
రథోత్సవం సం దర్భంగా గ్రామంలో బొమ్మలు, గాజుల దుకాణాలు విరివిగా వెలిశాయి.
పెద్దవడుగూరు: మండలంలోని కోటకొండ ఆంజనేయస్వామి రథో త్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి, ఆకుపూజ చేశారు. ఉత్సవ మూర్తిని రథంలో ఉంచి ఊరేగించారు. పరిసర గ్రామాల నుంచి కా కుండా సుదూర ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఉరవకొండ: వజ్రకరూరు మండ పరిధిలోని పొట్టిపాడులో సుంకులమ్మదేవి రథోత్సవాన్ని శుక్రవారం ఘ నంగా నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చే శారు. అనంతరం ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి భక్తులు రథాన్ని లాగారు. రథంపైకి అరటిపండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథో త్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్య లో తరలివచ్చారు. పోలీసు బందోబస్తు నిర్వహించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....