Share News

GOD: వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:18 PM

ఉగాది పండుగను పురస్కరించు కొని గురువారం మండలంలోని రాయలచెరువు గ్రామంలో వెలసిన చె న్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

GOD: వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
Devotees conducting Chennakesavaswamy Kalyanotsava along with Sridevi and Bhudevi

యాడికి, మార్చి19(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించు కొని గురువారం మండలంలోని రాయలచెరువు గ్రామంలో వెలసిన చె న్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ స భ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే రాత్రి స్వామి రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిం చారు. రాయలచెరువు గ్రామంలో ఏడేళ్ల తర్వాత రథోత్సవం నిర్వహించడంతో పరిసర గ్రామా ల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామంలో శుక్రవారం రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 19 , 2026 | 11:18 PM