RAMAJAN: భక్తిశ్రద్ధలతో రంజాన వేడుకలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:38 PM
ముస్లింలు పవిత్ర రంజాన పండుగను పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో ఈదుల్‌ఫితర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్ణ యించిన వేళకు సానిక ఈద్గాల వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీలు నమాజ్‌ను చదివి వినిపించారు. రంజాన యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు.
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
ముస్లింలు పవిత్ర రంజాన పండుగను పురస్కరించుకుని శనివారం భక్తిశ్రద్ధలతో ఈదుల్‌ఫితర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్ణ యించిన వేళకు సానిక ఈద్గాల వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఖాజీలు నమాజ్‌ను చదివి వినిపించారు. రంజాన యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. తోటివారితో సోదర భావం, ప్రేమ, సహనం, ఐక్యతతో మెలగాలని బోధించారు. శాంతి సందేశంతో పాటు దేశాభివృద్ధి, శ్రేయస్సు, సౌభ్రాతృత్వం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ప్రార్థనలు అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....