MLA: బద్ధకం వీడి ప్రజల్లోకి వెళ్లండి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:03 AM
బద్ధకం విడిచి కష్టప డితేనే భవిష్యత్తులో రాణిం చగలుగుతారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లు పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల మనసు గెలవడానికి శ్రమించాలన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం తాజా మాజీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతిని ఘనంగా సన్మానించారు.
- టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే కాలవ సూచన
రాయదుర్గం, మార్చి 19(ఆంధ్ర జ్యోతి): బద్ధకం విడిచి కష్టప డితేనే భవిష్యత్తులో రాణిం చగలుగుతారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లు పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. వార్డుల్లో తిరుగుతూ ప్రజల మనసు గెలవడానికి శ్రమించాలన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో శుక్రవారం తాజా మాజీ కౌన్సిలర్లు ప్రశాంతి, జ్యోతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ అధికార పక్షంలో పనిచేస్తున్నపుడు ఎవరి హోదాకు తగ్గస్థాయిలో వారికి ఒత్తిళ్లు ఉంటా యని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేయాలనుకున్న పనులను వైసీపీ దుష్టశక్తులు అనునిత్యం అడ్డుకునే ప్రయత్నం చేస్తునే ఉంటా యన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు ప్రత్యర్థుల సవాళ్లను, అవరోధా లను అధిగమిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాలనుకున్న మంచి పనులు చేస్తూ కూటమి ప్రభుత్వం రాషా్ట్రన్ని అభివృద్ధి వైపు నడిపిస్తోందన్నారు. అదేవిధంగా నియోజకవర్గస్థాయిలో, పట్టణంలో అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలతో మంచిసంబంధాలు కొనసాగించాలని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పక అన్ని స్థా నాల్లో విజయం సాధించే విధంగా బలం పుంజుకోవాలని సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....