Home » Uravakonda
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు ఉపాధ్యాయులు ఇతర సమస్యలపై శుక్రవారం సాయంత్రం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దార్ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటుంన్న సమ స్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
పట్టణంలోని లచ్చానుపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌ను బుధవారం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పరిశీలించారు. సర్వే నెంబరు 642లో 11.82 ఎకరాల విస్తీర్ణంలో ఎంఐజీ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. దానిని పరిశీలించిన జేసీ మాట్లాడుతూ... లేఅవుట్‌లో పిచ్చిమొక్కలు తొలగించాలని సూచిం చారు.
స్థానిక మార్కెట్ యార్డు లో చైర్‌పర్సన, కార్యదర్శికి మధ్య స్పర్థలు తారాస్థాయికి చేరాయి. చైర్ పర్సనకు చెందిన వాహన అలవెన్సు బిల్లును కార్యదర్శి పెట్టకపోవడం, కార్యదర్శితో పాటు ఇతర ఉద్యోగుల జీతాల ఆర్డరుపై చైర్‌పర్సన నెలపా టు సంతకం చేయడంలో ఆలస్యం చేసే వరకూ పరిస్థితి దారితీసింది.
మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.
ఏడు ఆర్టీసీ డిపోలను ఎత్తివేయకుండా కాపాడాలని ఎనఎంయూఏ డి పో అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకుడు కేఎస్ వలి పేర్కొన్నారు. అ దే విధంగా విద్యుత బస్సుల నిర్వహణను పినాకిని సంస్థకు అప్పగించ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎనఎంయూఏ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక డిపో వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు ఎర్రబ్యాడ్జీలు ధరించి గేట్ ధర్నా నిర్వహించారు.
జిల్లాలోని పలు మండలాల్లో బాలసంతు కుటుంబాలకు బీసీ-ఏ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, అదే ప్రకారం తమకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండంటూ బాలసంతు కులస్థులు వేడుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం బాలసంతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
స్థానిక ప్రభుత్వా సుపత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆసుపత్రిలో క్యాజువాలిటీ విభాగం మార్పుతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. కొన్నేళ్లుగా క్యాజువాలిటీ ఆసుపత్రి ప్రధాన గేటు దగ్గరలో ఉండేది.
కర్నూలు బారిస్టర్స్ సంఘం సభ్యుడిపై దాడి జరగడం శోచనీయమంటూ స్థానిక జేఎఫ్‌సీ ఎం కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం ఉదయం కోర్టులో విధుల నుంచి వైదొలగిన న్యాయవాదులు బైటకు వచ్చి ఆందోళన నిర్వహించారు.
పట్టణంలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉరవకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలురు కళాశాలలో 331మంది విద్యార్థులకు గానూ 12మంది గైర్హాజరయ్యారు. 319మంది పరీక్షలకు హాజరయ్యారు.
పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన పురాతన లక్ష్మీ నర సింహస్వామి దేవాల యంలో సోమ వారం స్వామి వారి కల్యా ణాన్ని అత్యంత వైభ వంగా నిర్వహించా రు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసిం హస్వామి ఉత్సవ విగ్రహాలను వేదపండి తులు అలంకరించి, శాసో్త్రక్తంగా కళ్యాణో త్సవాన్ని నిర్వహించా రు.