MLA: రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:49 PM
రైతులకు అండగా కూ టమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని బాచుపల్లిలో బుధవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పఽథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వ హించారు.
-ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం
గుత్తిరూరల్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రైతులకు అండగా కూ టమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్యెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. మండలంలోని బాచుపల్లిలో బుధవారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన పఽథకం సొమ్ము జమపై పరిశీలన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి ఏడాది రైతు రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. గ్రామంలోని ఇంటీంటికి వెళ్లి రైతులను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం రెన్యూ సోలార్ ప్లాంటు వారు సోలార్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఎమ్యెల్యే సమక్షంలో చెక్కులను అందజేశారు.
ఈ కార్య క్రమంలో మార్కెట్ యార్డు చైర్మన ప్రతాప్ ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన శీనా టీడీపీ పట్టణ, మండల కన్వీనర్ల్ ఏంకే చౌదరి, లక్ష్మీ రంగయ్య, సింగల్ విండో అధ్యక్షుడు శివశంకర్, టీడీపీ నాయకులు గో వర్ధన గౌడ్, సాంబశివ, నరసింహులు, తిమ్మప్ప రామచంద్ర, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
కూటమికృషి తోనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు
గుత్తి: జిల్లాలో ఆర్డీటీ సేవలను పునరుద్ధరించడం హర్షణీయమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్ధానిక కార్యాల యంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి లోకేశ పలుమార్లు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమితషాను కలిసి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరిం చడంపై ప్రస్తావించారన్నారు. ౖ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....