Share News

FESTIVAL: శేష వాహనంపై సంగమేశ్వరుడు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:54 PM

జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్వామివారు గ్రామ వీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి పార్వతీ పరమేశ్వరులను శేష వాహనంలో గ్రామ వీధుల్లో ఊరేగించారు.

FESTIVAL:  శేష వాహనంపై సంగమేశ్వరుడు

కూడేరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జోడులింగాల సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో స్వామివారు గ్రామ వీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి పార్వతీ పరమేశ్వరులను శేష వాహనంలో గ్రామ వీధుల్లో ఊరేగించారు. రెడ్డి సంఘం ఆధ్వ ర్యంలో స్వామిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శేష వాహనానికి విద్యుత ద్వీపాలు ఏర్పాటు చేశారు. వేడులకును తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 28 , 2026 | 11:59 PM