Share News

GOD: అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:22 PM

మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

GOD: అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
Devotees carrying Chaudeshwari Devi torches

యాడికి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని తూట్రా ళ్లపల్లిలో ఆదివారం చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. భక్తిశ్రద్ధలతో తయారుచేసిన జ్యోతులను ఊరేగింపుగా ఆల యానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు.

యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. చు ట్టుపక్కల గ్రామాలతో పాటు కడప జిల్లా నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 11గంటల వరకు రద్దీ తగ్గలేదు. ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అదేవిధంగా మండలంలోని చిలమకూరు యల్లమ్మ, యల్లనూరు పెద్దమ్మ ఆలయాల వద్ద కూడా భక్తుల రద్దీ కనిపించింది.

తాడిపత్రి: ఉగాది వేడుకలను పురస్కరించుకొని మండలంలోని గంగాదేవిపల్లి సమీపంలో వెలసిన ఎర్రగుడి గంగమ్మ దేవాలయానికి ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. జంతు బలిదానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

బ్రహ్మసముద్రం: మండలంలోని సంతే కొండాపురం గ్రామంలో వెలసిన దేవమ్మ, మారెమ్మ దేవతలకు ఆదివారం ప్రత్యేక పూజలను ఘ నంగా నిర్వహించారు. విగ్రహాలను ప్రతిష్టించి 41వ రోజు పూర్తి కావడంతో ఆలయంలో పూజలు చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 22 , 2026 | 11:22 PM