SCHOOL: పాఠశాలలో విరిగి పడిన ఫ్యాన
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:02 AM
మండలంలోని కరకముక్కల జడ్పీ హైస్కూల్లో శనివారం సీలింగ్ ఫ్యాన విరిగి పడింది. అయితే గదిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమా దం జరగలేదు. కరకముక్కల పా ఠశాల శిథిలవస్థకు చేరింది. దీం తో ఎన్నోసార్లు పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అధికారులు పాఠశాలకు మరమ్మతులు చేయించలేదు.
విడపనకల్లు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కరకముక్కల జడ్పీ హైస్కూల్లో శనివారం సీలింగ్ ఫ్యాన విరిగి పడింది. అయితే గదిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమా దం జరగలేదు. కరకముక్కల పా ఠశాల శిథిలవస్థకు చేరింది. దీం తో ఎన్నోసార్లు పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. కానీ అధికారులు పాఠశాలకు మరమ్మతులు చేయించలేదు. రోజుకో ఘటన జరుగుతుండటంతో విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 7న పాఠశాలలోని ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడి పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. అదే ఏడాది అక్టోబరు 17న ఓ గదిలో విద్యార్థులు లేని సమయంలో పై పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16న విద్యార్థులు బయట వరండాలో ఉన్న సమయంలో పై కప్పు ఊడి పడింది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....