Share News

FESTIVAL: భక్తి శ్రద్ధలతో రథోత్సవాలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:52 PM

మండల పరిధిలోని బూదగవి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూ ర్తిని రథంపై అధిష్ఠించి ఆలయం వద్ద నుంచి ఆంజనేయస్వామి పాదా లు ఉన్న ప్రాంతం వరకు రథాన్ని లాగారు.

FESTIVAL: భక్తి శ్రద్ధలతో  రథోత్సవాలు
Anjaneyaswamy Rathotsavam at Boodagavi, Uravakonda mandal

ఉరవకొండ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని బూదగవి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి రథోత్సవాన్ని వైభవం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూ ర్తిని రథంపై అధిష్ఠించి ఆలయం వద్ద నుంచి ఆంజనేయస్వామి పాదా లు ఉన్న ప్రాంతం వరకు రథాన్ని లాగారు. వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యంలో సీతారాముల రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి మరుసటి రోజు ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహి స్తారు. రథంపై ఉత్సవమూర్తులను కొలువు దీర్చి భక్తులు రథాన్ని లాగారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

డి. హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): డి. హీరేహాళ్‌ మండలంలోని ఓబుళపురం గ్రామంలో శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి రథ్సోతవం అంగరంగా వైభవంగా సాగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శనివారం స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. ఉదయం ఆలయంలో మూలవిరాట్లును అభిషేకించి, విశేషపూజలు నిర్వ హించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఉంచి భారీ జనసందోహం మధ్య రథాన్ని లాగారు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.

రాయదుర్గంరూరల్‌: మండలంలోని డీ కొండాపురం గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవాన్ని గ్రామపెద్దల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వ హించారు. ఆలయంలో ఉదయం మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకు పూజ చేశారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి యువకుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, నందికోళ్ల మధ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.


ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణం నిర్వహించి, మరుసటి రోజె రథోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

కణేకల్లు: మండలపరిధిలోని యర్రగుంట్ల గ్రామంలో వెలసిన యణ్ణేరంగనాథస్వామి రథోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయమే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మడుగుతేరును లాగారు. సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ఆవరణంలో రథాన్ని లాగారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అలాగే ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఎద్దులపరుషను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు తెలిపారు.

బ్రహ్మసముద్రం: మండలంలోని వేపులపర్తిలో వెలసిన లక్ష్మీరంగనాథ స్వామి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు స్వామి వారి కల్యాణోత్సవం మరుసటి రోజు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. శనివారం లక్ష్మీ రంగనాథస్వామి మూలవిరాట్లను రథంలో గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి పెద్దఎత్తున భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్‌ఐ సాయి కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 28 , 2026 | 11:52 PM