Share News

UTF: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:50 PM

ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్‌ నాయకు లు డిమాండ్‌ చేశారు. స్ధానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు.

UTF: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి
UTF leaders speaking at initiation in Guntakallu

- యూటీఎఫ్‌ నాయకులు

గుంతకల్లుటౌన, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యా యుల ఆర్థిక డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని యూటీఎఫ్‌ నాయకు లు డిమాండ్‌ చేశారు. స్ధానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద మంగళ వారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వి. కోటేశ్వరప్ప జిల్లా కోశా ధికారి రాఘవేంద్ర, కార్యదర్శి రామాంజినేయులు, అడిట్‌ కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్‌, అర్బన, రూరల్‌ అధ్యక్షుడు ఎల్లన్న, గిరిబాబు, ఏపీఎనజీవో యూనియన నాయకులు, మున్సిపల్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ యూనియన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ: ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర రావు, సహాధ్యక్షుడు రామప్ప చౌదరి, రాష్ట్ర కమిటీ సభ్యులు రమణయ్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు.


ఆర్‌ఐ రా మకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. యూటీఎఫ్‌ నాయకులు శేఖర్‌, బండయ్య, ఉమాపతి, జయరాములు, చంద్రమోహన పాల్గొన్నారు.

రాయదుర్గం రూరల్‌: ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్‌ నాయకులు వెంకట్రామిరెడ్డి, రవికుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఒక్కరోజు దీక్ష నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ హరికుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఏపీఎనజీఓ జిల్లా అధ్యక్షుడు మాధవ్‌, ఆర్టీసీ యూనియన నాయకులు దీక్షకు మద్ధ తు పలికారు. యూటీఎఫ్‌ నాయకులు హనుమంతరెడ్డి, మురళీకృష్ణ, నాగేంద్ర, వేములపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గంరూరల్‌: తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా యుటీఎఫ్‌ నాయకులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఒక రోజలు నిరాహారదీక్ష చేపట్టారు. యూటీఎఫ్‌ నాయకులు ఈశ్వరయ్య, ఎంటీఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు, పెన్షనర్ల సంఘం నాయకులు, ఎస్టీయూ నాయకులు మల్లికార్జున గౌడ్‌, వైసీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 24 , 2026 | 11:51 PM