Home » Trending
వేగంగా వెళుతున్న కారు రూఫ్టాప్లోంచి తల బయటపెట్టిన ఓ బాలుడికి ఓవర్‌హెడ్ బ్యారియర్ తగిలిన ఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది. బెంగళూరులో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
బిలియనీర్ల సక్సెస్‌కు కారణాలను ఓ న్యూరాలజిస్టు తాజాగా వివరించారు. అపరకుబేరుల మెదడు పనితీరు ఇతరులకంటే ఎలా భిన్నంగా ఉంటుందో విడమరిచి చెప్పారు. ప్రస్తుతం ఈ టాపిక్ జనాలకు బాగా నచ్చి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
బిగ్ బాస్ తాజా సీజన్లో వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్ ఖాన్ డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. సమస్యలు సృష్టించేవారికి శాంతి బహుమతులా అంటూ ఎద్దేవా చేశారు. ఓ కంటెస్టెంట్ తీరును ఎండగడుతూ సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.
జపాన్‌లో తాజాగా వింత స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రొనాట్ అని చెప్పుకుని వృద్ధురాలిని నమ్మించిన ఓ నేరగాడు ఆమె కష్టార్జితాన్ని దోచుకున్నాడు. అంతరిక్షంలో చిక్కుకుపోయానని చెప్పి ఆమె నుంచి ఏకంగా రూ.6 లక్షలను రాబట్టుకున్నాడు.
కేవలం రూ.3.5 లక్షల వార్షిక శాలరీతో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఓ బీటెక్ యువకుడు ఆ తరువాత ఎనిమిది నెలలకే కళ్లు చెదిరే శాలరీతో ఓపెన్ఏఐ సంస్థలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ కొట్టేశాడు. అతడి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
తుర్కియేలో ఓ లగ్జరీ నావ తన తొలి జర్నీలోనే జలసమాధి అయిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే, నెట్టింట మాత్రం ఈ ఉదంతంపై ఓ రేంజ్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఓ గ్రామంలో సర్వే కోసం వెళ్లిన గూగుల్ మ్యాప్స్ బృందంపై స్థానికులు దాడి చేశారు. వారి ప్రత్యేక వాహనాన్ని చూసి గ్రామస్థులు అపోహలకు లోనయ్యారు. చోరీ కోసం సమాచారం సేకరించేందుకు వారు వచ్చారని పొరబడి దాడికి దిగారు. అసలు విషయం తెలిశాక శాంతించారు. యూపీలో ఈ ఘటన జరిగింది.
జపాన్ టూరిస్టుల నుంచి లంచం తీసుకున్న ఇద్దరు గురుగ్రామ్ పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఉదంతం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రూ.50 లక్షల అప్పు చేసి అమెరికాలో చదువుకున్నాక జాబ్ రాకపోవడంతో ఇండియాకు తిరిగొచ్చిన ఓ యువకుడు చివరకు రూ.20 వేల జీతంపై ఓ స్టార్టప్ కంపెనీలో పనిచేయడం మొదలెట్టాడు. లోన్‌కు సంబంధించిన ఈఎమ్ఐలను అతడి తండ్రి తన పెన్షన్‌తో తీరుస్తున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.