Share News

Job Rejection Viral: జాబ్‌కు అప్లై చేసిన నిమిషాల వ్యవధిలో తిరస్కరణ.. ఉద్యోగార్థి ప్రశంసలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:15 PM

జాబ్‌కు అప్లై చేసుకున్న నిమిషాల్లో తిరస్కరణకు గురయిన ఓ అభ్యర్థి తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు. రిక్రూటర్ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Job Rejection Viral: జాబ్‌కు అప్లై చేసిన నిమిషాల వ్యవధిలో తిరస్కరణ.. ఉద్యోగార్థి ప్రశంసలు
Techie Job Rejection

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. జాబ్‌కు దరఖాస్తు చేసిన నిమిషాల వ్యవధిలోనే తిరస్కరణకు గురికావడంతో అతడు కాస్తంత ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నాడు (Instant Job Rejection).

కృష్ణవ్ కనోయ్ అనే టెకీ వాట్సాప్‌లో ఓ రిక్రూటర్‌కు తన జాబ్ అప్లికేషన్‌ను పంపించాడు. తాను మెసేజ్ పెట్టిన ఆరు నిమిషాల్లోనూ నిక్రూటర్‌ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పాడు. మరింత అనుభవజ్ఞుడైన ఉద్యోగిని తాము కోరుకుంటున్నట్టు రిక్రూటర్ సున్నితంగా చెప్పాడని అన్నాడు. కూల్ ప్రాజెక్టులను కొనసాగించాలంటూ తనను ప్రోత్సహించాడని చెప్పాడు. బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పాడని అన్నాడు.

Job Rejection 1.jpg


ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆ రిక్రూటర్‌పై ప్రశంసలు కురిపించారు. వెంటనే రిప్లై ఇచ్చిన అతడు ఉద్యోగార్థికి తగిన గౌరవమే ఇచ్చాడని అన్నారు. ఇరువురి సమయం వృథా కాకుండా జాగ్రత్త పడ్డాడని కితాబునిచ్చారు. కనీసం రిప్లై కూడా ఇవ్వకుండా ఉండేకంటే ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అభ్యర్థులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రతి కంపెనీ ఇలాంటి విధానాన్నే అవలంబించాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో కొందరు జెన్ జీ ఉద్యోగుల కొత్త కంపెనీలో చేరిన మొదటి రోజూ రాజీనామా చేయడం నెట్టింట కలకలానికి దారి తీసింది. యువత చర్యలను కొందరు తప్పుబడితే మరికొందరు సమర్థించారు. ఏదైనా నిర్మొహమాటంగా చెబితేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని అన్నారు. ఇలాంటి చర్యలను నిలకడ లేమిని సూచిస్తాయని కొందరు విమర్శించారు. జీవితంలో విలువైన పని అనుభవాన్ని కోల్పోవాల్సి వస్తుందని అన్నారు.


ఇవీ చదవండి:

ఫ్లైట్ జర్నీ.. ఈ చిట్కా పాటిస్తే ఒకే వరుసలోని సీట్లన్నీ మీకే సొంతం

కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..

Read Latest and Viral News

Updated Date - Dec 01 , 2025 | 11:24 AM