Share News

Flight Seat Blocking: ఫ్లైట్ జర్నీ.. ఈ చిట్కా పాటిస్తే ఒకే వరుసలోని సీట్లన్నీ మీకే సొంతం

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:17 PM

విమానంలో చాపపై పడుకుని జర్నీని ఎంజాయ్ చేసిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకోసం తాను ఫాలో అయిన ట్రిక్ ఏమిటో కూడా సదరు యువకుడు తెలిపాడు. దీంతో, నెట్టింట ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Flight Seat Blocking: ఫ్లైట్ జర్నీ.. ఈ చిట్కా పాటిస్తే ఒకే వరుసలోని సీట్లన్నీ మీకే సొంతం
International Flight Entire Row Blocking

ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ఎకానమీ క్లాస్ టిక్కెట్‌లతో జర్నీ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కాళ్లు చాపుకుని కూర్చొనే అవకాశం లేకపోవడం, పక్క సీట్లో భారీకాయులు ఉంటే కలిగే ఇబ్బంది వల్ల అంతర్జాతీయ ఫ్లైట్‌లల్లో ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. ఈ సమస్య తీరేలా ప్రయాణికులు తమ సీటు వరుసలోని అన్నీ సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందంటూ ఓ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ట్రిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (International Flight Entire Row Blocking).

అభినవ్ చంద్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్‌ గురించి తెలియజేశాడు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయం ఉంది. ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించి తమ పక్క సీటులో లేదా తమ సీటున్న వరుసలోని అన్నిటినీ బుక్ చేసుకోవచ్చు. పక్క సీటును మాత్రమే బుక్ చేసుకునేందుకు నైబర్ ఫ్రీ సీట్ ఆప్షన్‌ను ఎంచుకుని రూ.4,654 చెల్లించాలని అతడు తెలిపారు. ఆ వరుస మొత్తాన్ని బుక్ చేసుకోవాలంటే బ్లాక్ ఎంటైర్ రో ఆప్షన్‌ను ఎంచుకుని రూ.7446 చెల్లించాలి. ఎయిర్‌ఇండియా వెబ్‌సైట్‌లో మేనేజ్ బుకింగ్ సెక్షన్‌లోకి వెళితే పైఆప్షన్స్‌ అందుబాటులోకి వస్తాయి.


ఇక ఈ వీడియోలో అభినవ్ మూడు సీట్లున్న ఉన్న వరుస మొత్తాన్ని ‘బ్లాక్ ఎంటైర్ రో’ ఆప్షన్‌తో బుక్ చేసుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న చాప మూడు సీట్లపై పరుచుకుని పడుకున్నాడు. అయితే, ఫ్లైట్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని చెప్పాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సమీపంలోని సీట్లను ఇలా బ్లాక్ చేయొద్దని కూడా సూచించాడు. దీని వల్ల బుకింగ్ మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఇక దేశీ ప్రయాణాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందా? లేదా? అనే అంశంపై తనకు స్పష్టత లేదని చెప్పాడు. అయితే, ఎయిర్‌ఇండియాతో పాటు లుఫ్తాన్సా, ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో కూడా ఇలాంటి సీట్ బ్లాకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.


ఇవీ చదవండి:

కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..

వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ

Read Latest and Viral News

Updated Date - Nov 29 , 2025 | 02:23 PM