Fitness Influencer Death: వారాల తరబడి జంక్ ఫుడ్ తిని ఫిట్‌నెస్ కోచ్ దుర్మరణం
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:42 PM
బరువు తగ్గేందుకు ఓ హెల్త్ ఛాలెంజ్‌కు పూనుకున్న ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా జంక్ ఫుడ్‌ను అతిగా తిని దుర్మరణం చెందాడు. వారాల తరబడి జంక్ ఫుడ్ తిన్న అతడు ఓ రాత్రి వేళ నిద్రలోనే కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బరువు తగ్గేలా తన ఫాలోవర్లను ప్రోత్సహించే ప్రయత్నంలో ఓ రష్యన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దుర్మరణం చెందిన ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా (Viral) మారింది.
30 ఏళ్ల డిమీట్రీ న్యుయాజిన్‌కు ఫిట్‌నెస్ కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. ప్రముఖ రష్యా క్రీడాకారులకు అతడు కొన్నేళ్ళ పాటు వ్యక్తిగత కోచ్‌గా శిక్షణ ఇచ్చాడు. ఓరెన్‌బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్, నేషనల్ ఫిట్‌నెస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అధిక బరువుతో బాధపడే వారు ఆ సమస్య నుంచి బయటపడేలా తరచూ సూచనలు ఇస్తుంటాడు (Russian Fitness Influencer Death).
ఈ మధ్య బరువు తగ్గాలనుకునే తన ఫాలోవర్లకు ఓ ఛాలెంజ్ విసిరాడు. తనతో పాటు ఓ షెడ్యూల్ ప్రకారం కసరత్తులు చేసి బరువు తగ్గించుకోవాలని సూచించారు. ఈ దిశగా ముందుగా తాను బరువు పెరగాలనుకున్నాడు. వారాల తరబడి జంక్ ఫుడ్ తినడం ప్రారంభించాడు. పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పేస్ట్రీలు వంటి ఫుడ్‌ను రోజుకు మూడు పూటలా తిన్నాడు. 25 కేజీల మేర బరువు పెరగాలనేది అతడి లక్ష్యం. ఈ క్రమంలో ఒక్క నెలలోనే 13 కేజీల మేర బరువు పెరిగాడు. మొత్తం బరువు 105 కేజీలకు చేరుకుంది. తన తిండి తాలూకు వీడియోలను కూడా నెట్టింట రెగ్యులర్‌గా పంచుకునే వాడు.
ఈ మధ్య కాలంలో అతడి ఆరోగ్యం క్రమంగా దిగజారడం ప్రారంభించింది. ఫలితంగా వీడియోలు చేయడం కూడా తగ్గించాడు. డాక్టర్ చెకప్‌కు కూడా వెళ్లివచ్చాడు. కానీ ఇంతలోనే అతడిని మృత్యువు కబళించింది. నవంబర్ 18న రాత్రి వేళ నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. దీంతో, అతడి ఫాలోవర్లు శోకసంద్రంలో కూరుకుపోయారు.
ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో అనేక మంది ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లపై ఇన్‌ఫ్లుయెన్సర్‌లను అప్రమత్తం చేశారు. ఆరోగ్యంతో చెలగాటం వద్దని హెచ్చరించారు.
ఇవీ చదవండి:
వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ
15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్