UP Groom: పెళ్లి వేడుకలో రూ.31 కట్నం ఇవ్వబోయిన వధువు కుటుంబం.. ఇంతలో..
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:47 PM
యూపీలో ఓ యువకుడు తన అభ్యుదయ భావాలను చాటుకున్నాడు. పెళ్లి వేదికపై రూ.31లక్షల కట్నాన్ని వద్దని తిరస్కరించాడు. దీంతో, అతడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అనేక రంగాల్లో దూసుకుపోతున్న భారత్‌లో ఇంకా అనేక దురాచారాలు కొనసాగుతున్నాయి. దేశంలో నిత్యం ఏదో మూల బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, గృహహింస ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఉత్తర్‌ప్రదేశ్ యువకుడు చేసిన పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడిని గ్రామస్థులు అందరూ వేనోళ్ల పొగుడుతున్నారు (UP Groom Rejects Dowry).
ముజఫర్‌నగర్ జిల్లా నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రాణా, షహాబుద్దీన్ నగర్ గ్రామానికి చెందిన అదితీ సింగ్‌ల వివాహం ఇటీవల జరిగింది. అయితే, వరుడికి రూ.31 లక్షల కట్నం ఇచ్చేందుకు వధువు కుటుంబం నిర్ణయించింది. తిలకధారణ కార్యక్రమంలో ఈ కట్నం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కట్నం తీసుకునే సమయంలో వరుడు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వధువు కుటుంబం ఇచ్చిన కట్నాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించాడు. అదే సమయంలో సంప్రదాయాన్ని గౌరవిస్తూ కేవలం రూ.1 మాత్రమే తీసుకున్నాడు. వరుడు సడెన్‌గా ఇలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చేసరికి వధువు కుటుంబం ఆశ్చర్యపోయింది. అభ్యుదయ భావాలున్న అల్లుడు లభించినందుకు సంతోషించింది.
తాను వరకట్నానికి పూర్తివ్యతిరేకినని అవధేశ్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ దురాచారాన్ని రూపుమాపాలని వ్యాఖ్యానించారు. కూతురి పెళ్లి కోసం అప్పులు చేయాల్సి రావడం, వాటిని తీర్చేందుకు జీవితాంతం కష్టపడాల్సిన దురవస్థ ఏ తండ్రికీ రాకూడదని వ్యాఖ్యానించాడు. అవధేశ్ రాణా గొప్పదనం చూసి అతిథులు కూడా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి అతడిని అభినందించారు.
ఇవీ చదవండి:
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..
వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ