Home Loan Burden: ఇలాంటప్పుడు గృహ రుణం మాత్రం తీసుకోకండి.. ఐటీ ఇంజనీర్ ఆవేదనా భరిత పోస్టు
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:01 PM
30 ఏళ్ల కాలవ్యవధిపై గృహ రుణం తీసుకున్న తన స్నేహితుడు ఎలాంటి కష్టాలు పడుతున్నాడో చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అతడి అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏఐ జమానాలో టెక్ రంగం ఉద్యోగులను లేఆఫ్స్ భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో 30 ఏళ్ల కాలవ్యవధితో హోమ్ లోన్ తీసుకుంటే ఎలాంటి చిక్కుల్లో పడాల్సి వస్తుందో చెబుతూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట సంచలనంగా మారింది (Home Loan Burden Viral Video).
ఈ పోస్టులో తేజూ అనే నెటిజన్ తన స్నేహితుడి కష్టాలను చెప్పుకొచ్చారు. అతడు రెండు నెలలుగా జాబ్ లేక ఖాళీగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్ట్ టైమ్ ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నట్టు తెలిపారు. కేవలం గృహ రుణం తాలూకు ఈఎమ్‌ఐలు చెల్లించేందుకే ఇలా చేస్తున్నట్టు చెప్పారు. మంచి ఆఫర్ దక్కుతుందన్న ఉద్దేశంతో అతడు తన జాబ్‌కు రాజీనామా చేశాడని అన్నారు. కానీ ప్రస్తుతం కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారడంతో రెండు నెలలుగా అతడు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని తెలిపాడు. హోమ్ లోన్ ఈఎమ్ఐలు కట్టేందుకు అతడు చివరకు ర్యాపిడో డ్రైవర్‌గా మారారని తెలిపాడు. తన కుటుంబాన్ని సొంతూరికి పంపాడని చెప్పాడు.
ఇంత చేసినా ఈఎమ్‌ఐల భారం తగ్గలేదని, జాబ్ లేకుండా బతుకు బండిని లాగడం అతడికి కష్టంగా మారిందని తేజు తెలిపాడు. దీంతో, ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ అప్పుడప్పుడూ ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నాడని అన్నారు. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పర్సనల్ లోన్‌ను వృథాగా ఖర్చు చేసినా పర్లేదు కానీ ప్రైవేటు జాబ్ ఉన్న వారు ఇంతటి కాల వ్యవధితో హోమ్‌లోన్‌లు మాత్రం తీసుకోవద్దని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్
గూగుల్ నానో బనానా ప్రో సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే..