Home » Tirupathi News
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్‌చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో తిరుపతి ఐఐటీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఐఐటీలకు అధునాతన మౌలిక సదుపాయాలు లభించనున్నాయి. నూతన ప్రొఫెసర్ పోస్టులు, సీట్ల పెంపుతో విద్యారంగం మరింత బలోపేతమవుతుంది
జగన్ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునేందుకు శ్రీకారం. ఈ రోజు తిరుమలలో జరగనున్న అత్యవసర సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరగనుంది
తిరుమలలో వరుస సెలవులతో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఏడో తరగతి బాలికను బలవంతంగా పెళ్లి చేశారు. తనను కాపాడమంటూ పాఠశాల టీచర్లను వేడుకున్న బాలికను బాలసదన్‌కు తరలించారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ నేటి నుంచి అమల్లోకి రానుంది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
రాత్రి గస్తీకి డ్రోన్ వినియోగానికి తిరుపతి పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ డ్రోన్లు వాడేందుకుగానూ అత్యంత శక్తివంతమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా వినియోగించనున్నారు. దీనిలో భాగంగా అర్ధరాత్రి తిరుపతి, శివారు ప్రాంతాల్లో డ్రోన్ ఎగురవేసి రాత్రి పహారా కాశారు
కృష్ణపట్నం కేంద్రంగా పరిశ్రమల విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు తిరుపతి జిల్లాకు బంగారు బాటలు పరవనున్నాయి.
ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.