Bhanuprakash Reddy: తిరుమలపై అసత్యం ప్రచారం.. భూమనపై భానుప్రకాష్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:56 AM
గతంలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.
తిరుమల: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ( Bhanuprakash Reddy) స్పందించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మూడంచెల భద్రతలో భాగంగా శ్రీవారి ఆలయం, భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందని ఉద్ఘాటించారు భానుప్రకాష్ రెడ్డి.
భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు చేస్తున్న మఠాలు, పీఠాధిపతులంటే టీటీడీకి చాలా గౌరవం ఉందని ఉద్ఘాటించారు. మఠాల్లోనూ భక్తుల ఆధార్ వివరాలు తీసుకొని వసతులు కల్పించాలని నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు. తిరుమలలో భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించామని పేర్కొన్నారు. వివరాలు తీసుకోవాలంటే.. హిందూధర్మం, మఠాలపై దాడి అని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడతారా..? అని ప్రశ్నించారు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
For More AP News and Telugu News