Share News

Flag: వెయ్యి అడుగుల జెండా

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:21 AM

‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

Flag: వెయ్యి అడుగుల జెండా
జాతీయ జెండాతో ర్యాలీ

తిరుపతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్‌, టూరిజం, ఎస్వీ యునివర్సిటీ సంయుక్తంగా మహతి నుంచి ఎస్వీయూ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. ‘ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి రెండు వారాల కార్యక్రమం రూపకల్పన చేశాం. సెల్ఫీ పాయింట్‌ వద్ద సెల్ఫీ దిగి అప్లోడ్‌ చేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. దేశభక్తిని ఒక రోజుకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించేలా ఉండాలి. మన పరిసరాలను, నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’ అని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, కమిషనర్‌ మౌర్య పిలుపునిచ్చారు. ఎస్వీయూ వీసీ అప్పారావు, ఏపీ జీబీసీ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, వూకా విజయ్‌ కుమార్‌, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్‌, అదనపు కమిషనర్‌ చరణ్‌ తేజ్‌ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్లు నరసింహ ఆచారి, నరేంద్ర, రేవతి, కాంచన, కుమారి, అన్నా అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 01:23 AM