Tirupati YCP Attack On Driver: తిరుపతిలో దళిత డ్రైవర్‌పై దాడి.. పోలీసు శాఖ సీరియస్
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:19 PM
తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది.
అమరావతి: తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దళిత డ్రైవర్ పవన్ కుమార్‌పై దాడి వీడియో వైరల్‌గా మారడంతో లోతైన విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు.. కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి సమక్షంలో, వారి కార్యాలయంలోనే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు.
బాధితుడు పవన్ తండ్రి నీలం జయరాజు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిగా ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఘటనలో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారని అధికారులు నిర్థారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగ్గారెడ్డి అనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, వీరిని మధ్యాహ్నం లోగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
దళిత డ్రైవర్‌పై దాడి చేసిన అనిల్ రెడ్డితో పాటు దాడిలో అభియన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇతరుల పాత్రపైనా కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. హింసిస్తూ వీడియోలు తీయడమే కాకుండా వాటిని ఎవరెవరికి పంపారనే అంశంపైనా విచారణ జరుపుతున్నారు. పవన్ కుమార్‌ను ఏ కారణంతో దాడి చేశారు?దళిత యువకుడిని ఇంత పాశవికంగా హింసించడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలోను దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తును పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనలో కారకులైన అందరిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read:
వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ అవినాష్ రెడ్డిపై మరో కేసు
అమ్మా.. ఇక సెలవ్..హరితా క్షమించు... నా టైం ఇక్కడితో అయిపోయింది
For More AndhraPradesh News