Share News

Elephant: హ్యాపీ ఎలిఫెంట్స్‌ డే

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:29 AM

ఏనుగుల దినోత్సవం సందర్భంగా సినీనటి, మిస్‌ ఇండియా-2020 విజేత మానస వారణాశి మంగళవారం ఉదయం తిరుమల గోశాలకు చేరుకున్నారు. ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్నారు.

Elephant: హ్యాపీ ఎలిఫెంట్స్‌ డే
ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్న సినీనటి మానస, ఎస్వీ జూలో ఏనుగులకు పండ్లు, కూరగాయలు పెడుతున్న విద్యార్థులు, తిరుమలలోని ఎర్రమట్టి దిబ్బల వద్ద ఏనుగు పిల్లలు జలకాలాట

గజరాజు ఆశీర్వాదం

తిరుమల, ఆంధ్రజ్యోతి: ఏనుగుల దినోత్సవం సందర్భంగా సినీనటి, మిస్‌ ఇండియా-2020 విజేత మానస వారణాశి మంగళవారం ఉదయం తిరుమల గోశాలకు చేరుకున్నారు. ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు ఆమె వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే, మిస్‌ ఎర్త్‌ 2019 డాక్టర్‌ తేజస్వని మనోజ్ఞ కూడా సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏనుగుల కడుపు నింపగా..

తిరుపతి(మంగళం), ఆంధ్రజ్యోతి: తిరుపతి ఎస్వీ జూ పార్కులో మంగళవారం ఏనుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తాజా పండ్లు, కూరగాయలను వాటికి ఆహారంగా అందించారు. ఏనుగుల సంరక్షణపై వీరికి అధికారులు అవగాహన కల్పించారు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. సబ్‌ డీఎ్‌ఫవో నాగభూషణం, రేంజ్‌ ఆఫీసర్‌ జగదీష్‌, ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ దీపక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంతతి పెరుగుతోంది

ఏనుగుల సంతతి పెరుగుతోందని అధికారులు అంటున్నారు. అందుకు నిదర్శనం తిరుమలలోని ఎర్ర మట్టి దిబ్బల వద్ద ఏనుగు పిల్లలు జలకాలాడుతూ కెమెరాకు చిక్కాయంటూ మంగళవారం ఫొటో విడుదల చేశారు. ఏనుగుల గుంపు దగ్గరక వెళ్లడం, ఫొటోలు తీయడం, సెల్ఫీ ప్రయత్నాలు చేయొద్దన్నారు. చీకటి పడ్డాక పొలాల్లోకి వెళ్లొద్దని అటవీ సమీప రైతులకు సూచించారు.

Updated Date - Aug 13 , 2025 | 01:29 AM