YSRCP: తిరుపతిలో దళిత యువకుడిపై దాడి.. వైసీపీ కీలక నేత అనుచరుల అరాచకాలు వెలుగులోకి..
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:07 PM
వైసీపీ కీలక నేత భూమన అభినయ్ అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తిరుపతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కీలక నేత భూమన అభినయ్ (YSRCP Leader Abhinay Bhuma) అనుచరుల అరాచకాలు తిరుపతిలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి, అతని స్నేహితులు దళిత యువకుడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కుమార్ అనే యువకుడు తీసుకున్న నగదు ఇవ్వలేదనే కారణంతో కిడ్నాప్ చేసి లాడ్జీలో బంధించి దుడ్డుకర్రలు, పైబర్ లాఠీలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు అభినయ్ అనుచరులు.
పవన్ కుమార్ తండ్రి తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో భూమన అభినయ్, అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. అయితే, ఇంకా కిడ్నాపర్ల చెరలోనే పవన్ కుమార్ ఉన్నారు. బాధిత యువకుడు ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల నుంచి తల్లిదండ్రులకు అందుబాటులో లేకుండా పోయాడు బాధిత యువకుడు పవన్ కుమార్. గత రాత్రి పవన్ తండ్రి ఫోన్‌కు చిత్ర హంసల వీడియోలను భూమన అభినయ్, అతని అనుచరులు పంపించారు.
డబ్బు కోసం తనను హింసిస్తున్నారని పవన్ కుమార్ తన తండ్రికి చెబుతూ.. బోరున విలపించాడు. నిన్న(బుధవారం) రాత్రి 11 గంటలకు పోలీసులకు బాధిత యువకుడు పవన్ కుమార్ తండ్రి జయరాజ్ సమాచారం ఇచ్చాడు. అయితే పవన్ కుమార్ కుటుంబం పులిచెర్ల మండలం మెరవపల్లిలో నివాసం ఉంటున్నారు. పోలీసులు తన కుమారుడు ఆచూకీ త్వరగా గుర్తించాలని, తనకు న్యాయం చేయాలని పవన్ కుమార్ తండ్రి జయరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అరాచక ఘటనపై హోంమంత్రి అనిత ఏమన్నారంటే..
తిరుపతి వైసీపీ అరాచక ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రౌడీ రాజకీయం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటన వెనక ఉన్న సూత్రధారులను కూడా వదిలేది లేదని హెచ్చరించారు. వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఈ దాడులు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాడి చేసిన వారినీ పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తయారవుతాడా..? అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Fire Accident: ఏపీలో అనుకోని ప్రమాదం... అప్రమత్తమైన అధికారులు
CM Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన.. మూడు పథకాలకు శ్రీకారం
For More AP News and Telugu News