Home » Thanneeru Harish Rao
అర్ధసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవు అని పేర్కొన్నారు.
మాజీమంత్రి హరీశ్‌రావుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షుద్ర పూజల విషయంలో ఆయన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వెళ్లిన గుడులు క్షుద్ర పూజలకు ఫేమస్ అని చెప్పుకొచ్చారు.
క్షుద్రపూజలు ఎందుకు చేశావంటే మాజీ మంత్రి హరీశ్‌రావు తమకు లీగల్ నోటీసులు పంపుతున్నారని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో సహా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారికి లీగల్ నోటీసులు పంపారని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
కాళేశ్వరం విషయంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్‌లో హరీశ్‌రావు నిష్ణాతుడైతే వాళ్ల మామ కేసీఆర్ ఆయనను మొదట్లో మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్‌పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి నేడు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు.. పీవీకి ఘన నివాళులు అర్పించారు.