Home » TG Politics
కళాకారులకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ విజయశాంతి అసెంబ్లీలో కోరారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారామె.
భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలపై శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
బీసీ కులగణన అంశంపై అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య జరిగిన ఆసక్తికర చర్చలో సంవాదమిది! కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న రెండో దశ జనగణనకు 40 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీ అంశాన్ని చేర్చాలనే డిమాండ్‌తో స్వల్పకాలిక చర్చ పెట్టారు.
మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయా తేదీల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
‘కేసీఆర్ చావును నేను కోరడం లేదు, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో ఫ్లోలో అలా వచ్చింది’’ అని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించిన ఎర్రవల్లి ఫాంహౌస్‌కి దళితులు వెళ్లడంతో పసుపు నీటితో బీఆర్ఎస్ నేత సంధ్యారాణి శుద్ధి చేశారని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిని ఏకవచనంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ధ్వజమెత్తారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.