Home » TG Politics
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ 80 ఎకరాలతో కేసీఆర్ జేజమ్మ లెక్క ఉటుందని మంత్రి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జగదీష్ రెడ్డి చేసిన అవనీతిపై విచారణ చేపిస్తున్నామని బాంబు పేల్చారు.
హైడ్రా మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిదని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని తెలిపారు. హైడ్రాలో పని చేస్తున్న వారి జీతాలు తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆదాయం పడిపోవటంతో పాటు అప్పులు భారీగా పెరిగాయని కేటీఆర్ ఆక్షేపించారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
రాజ్యాంగ పరిరక్షణ, న్యాయం, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం పనిచేసిన ప్రజాసేవకుడిగా.. శివశంకర్‌కు గొప్ప పేరుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాను విద్యార్థిగా రాజకీయల్లో ఉన్నపుడు శివశంకర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు.
రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటమార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.
తాను అవకాశవాది కాదు.. అని అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని అని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్‌లో చేరమని నన్ను ఎవరు అడగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో దళిత వర్గాలకు చోటులేదని విమర్శించారు.