Share News

Kalvakuntla Kavitha: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:35 PM

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు‌ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నారని కవిత ఆరోపించారు. అందరూ తననే.. టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

Kalvakuntla Kavitha: ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
MLC Kavitha

హైదరాబాద్: ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా అదో సంచలనంగా మారుతుంది. ఎప్పుడు, ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నాయకులను కలవర పెడుతోంది. సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని తేడా లేకుండా.. తన మాటలతో రెచ్చిపోతుంది. ఆమె మాటల్లో నిజా నిజాలు పక్కన పెడితే.. కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. మరోసారి కవిత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..


బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీష్ రావు‌ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా తన మీద దాడి చేస్తున్నాయని కవిత ఆరోపించారు. అందరూ తననే.. టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలియదని, కానీ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే.. ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్‌‌లోనే రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరినట్లు పేర్కొన్నారు. రాజీనామాకు వారెందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని తెలిపారు.


బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవి ఆనాడు వద్దనుకున్నాను.. ఇప్పుడు వద్దనుకుంటున్నానని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలుంటే అంత మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని తేల్చి చెప్పారు. ఎంతమంది జైబీసీ అంటే..అంత మంచిదని పేర్కొన్నారు. బీసీల కోసం అందరం కలసి కొట్లాడుదామని పిలపునిచ్చారు. ఇష్యూ మీద మాట్లాడితే సమాధానం ఇస్తాను.. వ్యక్తిగతంగా విమర్శలు సరికావని అన్నారు. సొంత ఊరు ఆహ్వానం ఎప్పుడూ ప్రత్యేకమే అని.. చింతమడకలో బతుకమ్మ వేడుకలకు వెళ్ళటం వెనుక రాజకీయం ఏమీ లేదని చెప్పారు. గతేడాది రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనలేదని వివరించారు. ఒకటి కాదు.. రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. బతుకమ్మ పేరుతో మహిళలకు చీరలు ఇవ్వాలి కానీ ఇందిరమ్మ పేరుతో మాత్రం ఇవ్వొద్దని కవిత డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Updated Date - Sep 20 , 2025 | 12:55 PM