Kishan Reddy: నితిన్ గడ్కరీతో కిషన్ రెడ్డి భేటీ.. ఆ అంశంపై కీలక చర్చలు..
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:36 PM
విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, బాంబే వంటి అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటు ద్వారా వెనుకబడిన గ్రామాలు అభివృధి చెందుతున్నాయని తెలిపారు.
ఢిల్లీ: కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు చెప్పారు. తెలంగాణలో 33 జిల్లాల రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చేసే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రహదారుల నిర్మాణంలో రోడ్డు సేఫ్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర కీలకంగా ఉంటుందని వివరించారు.
విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, బాంబే వంటి అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటు ద్వారా వెనుకబడిన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆధ్వర్యంలో 34 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 422 కిలోమీటర్ల రోడ్లను రూ.868 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.
సిరోంచ టు మహదేవ్ పూర్ సెక్షన్ నేషనల్ హైవేను 17 కిలోమీటర్లలో రూ.163 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. గౌరెల్లి టు వలిగొండ హైవేను 42 కిలోమీటర్లకు రూ.690.33 కోట్లతో నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 4 లైన్ల హైవే నిర్మాణం నల్గొండ టౌన్ నుంచి నకిరేకల్ టు నాగార్జున సాగర్ వరకు 14 కిలోమీటర్ల మేర రూ. 516.17 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐకానిక్ బ్రిడ్జి (కృష్ణానది సోమశిల)13.4 కిలోమీటర్లను రూ. 436 కోట్ల వ్యయంతో చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Also Read:
ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో.. సీఎం డెడ్లీ వార్నింగ్
వైసీపీ హయాంలో చిరంజీవిని అవమానించారంటూ బాలయ్య ఫైర్..