Home » TG Govt
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్‌కాం సేవలను మరింతగా బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టామ్‌కాంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్‌పై తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై సంబంధిత అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.
తక్కువ ధర పేరుతో నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రహదారి పక్కన, లారీల్లో విక్రయించే ఎరువులు కొనవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఎరువుల సంచిపై తయారీ, గడవు తేదీలతోపాటు ఎంఆర్‌పీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని రైతులకు విజ్ఞప్తి చేసింది.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలను పలువురు నేతలు కొనియాడారు.
టైర్డు ఉద్యోగుల బిల్లుల క్లియరెన్స్ కోసం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామన్న హామీ మేరకు మూడో విడతగా ప్రభుత్వం గురువారం మరో రూ.2,000 కోట్లు విడుదల చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులు ఎక్కువగా చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందరూ ప్రధాన మంత్రుల కంటే మోదీ అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు.
విద్యావ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
హైడ్రాపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న శాఖనని.. వారే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.