Share News

Medaram: మేడారం జంపన్నవాగు ప్రధాన ఆర్చీకి కలరింగ్‌..

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:39 PM

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీ దగ్గరపడ్డ తరుణంలో వివిధ పనులన్నీ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Medaram: మేడారం జంపన్నవాగు ప్రధాన ఆర్చీకి కలరింగ్‌..

తాడ్వాయి(ములుగు): మేడారం జంపన్నవాగు(Medaram Jampanna Vagu)కు ముందు భాగంలో ఉన్న ఆర్చీకి దేవస్థానం అధికారులు కలరింగ్‌ పనులు చేపట్టారు. మహాజాతర సందర్భంగా ప్రధానంగా దేవస్థానంలో ఆర్చీగేట్‌, పూజారుల, భక్తుల వసతి గృహాలు, ఆన్నదాన సత్రాలు, హుండీల భద్రత గదులు పలు నిర్మాణాలకు రంగులు వేస్తున్నారు.


samma1.2.jpg

దొంగలున్నారు జాగ్రత్త..

తాడ్వాయి: వనదేతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులను పోలీస్‌, దేవాదాయ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మేడారంలో దొంగలు ఉన్నారని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జేబు దొంగల ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలను దేవస్థానం ప్రాంగణం, పరిసరాల్లో ఏర్పాటు చేశారు. భక్తులు భక్తిభావంతో సమ్మక్క- సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్నారని, అదును చూసి భక్తుల డబ్బులు, సొమ్ములను దోచుకుంటున్నారని అధికారులు తెలిపారు.


sammkka2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

వందేభారత్‌ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ

‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్‌ సక్సెస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 13 , 2026 | 12:39 PM