Home » TG Govt
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు(ఆదివారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దామని తెలంగాణ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
భాగ్యనగరంలో లష్కర్ బోనాల సందడి నెలకొంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీరు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో సెలక్ట్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సెలక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్-2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పైకి ఓ కారు దూసుకురావడంతో జరిగిన చిన్న ప్రమాదం తర్వాత చోటుచేసుకున్న ఘర్షణలో కాన్వాయ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేశారు. రేగా కాంతారావు పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు వేధిస్తున్నారని, వ్యక్తిగత ఫోటోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని భద్రాద్రి జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడే తెలంగాణ తమ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి ప్రకటించారు.