IPS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ..
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:26 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 20మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతి నియమితులయ్యారు. లాజిస్టిక్స్ IGగా గజారావు భూపాల్, ఇంటెలిజెన్స్ DIGగా ఆర్.భాస్కరన్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సీపీగా చందన దీప్తి, సైబరాబాద్ DCPగా టి.అన్నపూర్ణ, ట్రాఫిక్-3 DCPగా రాహుల్ హెగ్డే బదిలీ అయ్యారు. అలాగే CID ఎస్పీగా ఆర్.వెంకటేశ్వర్లు, హైదరాబాద్ క్రైమ్ DCPగా ఎస్.చైతన్యకుమార్, ట్రాఫిక్-1 DCPగా అవినాష్ కుమార్, ట్రాఫిక్-2 DCPగా కాజల్, సైబరాబాద్ కమిషనరేట్ DCPగా శేషాద్రిని రెడ్డి, మల్కాజ్‌గిరి కమిషనరేట్ DCPగా రాహుల్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ DCPగా శివం ఉపాధ్యాయ, మల్కాజ్‌గిరి ట్రాఫిక్-2 DCPగా వి.శ్రీనివాసులు బదిలీ అయ్యారు.