Home » test cricket
భారత టెస్టు జట్టులో కొత్త పేస్ దళాన్ని తీర్చిదిద్దే పనిలో బీసీసీఐ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.
ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో చరిత్ర సృష్టించడం ప్రతి ప్లేయర్ కల. ఆ కలను భారత మహిళా జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన ఆమె.. లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది.
అఫ్గాన్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తాజాగా తన అరంగేట్ర అనుభవాలను సుతార్ పంచుకున్నాడు.
న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎక్కువసేపు నిలవలేదు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్‌తో కలిసి ఫూటుగా మద్యం తాగి అపరిచితులపై దాడి చేసి వీరంగం సృష్టించారు.
భారత టెస్టు జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. బంతితో, బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిసి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ బ్యాటర్ వింత ఔట్ అయ్యాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులో రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌లో అఫ్గానిస్థాన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. అయితే టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఫాలోఆన్‌లో టీ బ్రేక్ సమయానికి 29 ఓవర్లు ఆడిన అఫ్గాన్.. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.