టీమిండియాకు గుడ్‌న్యూస్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా సిద్ధం
ABN , Publish Date - Jul 31 , 2026 | 04:06 PM
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ పరీక్షల్లో బుమ్రా పాసైనట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెల్లడించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. బుమ్రా, సాయి సుదర్శన్‌లకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తేనే మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారని అందులో పేర్కొంది. తాజా పరిణామంతో బుమ్రా ఆడటంపై క్లారిటీ వచ్చినట్లే.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బుమ్రా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకుని శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుతో పాటు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరిగే రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అందులో భాగంగా శ్రీలంకపై 2-0తో సిరీస్ గెలవడం భారత జట్టుకు అత్యంత కీలకం. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటన ఉండటంతో ఈ సిరీస్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటికే గాయాల కారణంగా హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి జట్టుకు దూరమయ్యారు. అలాగే వాషింగ్టన్ సుందర్ కండరాల గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఆకాశ్ దీప్ కూడా వెన్ను ఒత్తిడి గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బుమ్రా ఫిట్‌నెస్ సాధించడం టీమిండియాకు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
2027 వన్డే ప్రపంచ కప్.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్
అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్