రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి అదిరిపోయే ఎంట్రీ
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:20 PM
భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన షహ్నీల్.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘ద ట్రైటర్స్’ సీజన్-2లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షహ్నీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన షహ్నీల్.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘ద ట్రైటర్స్’ సీజన్-2లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ షో ప్రారంభ కార్యక్రమంలో ఆమె పరిచయం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘మై నేమ్ ఈజ్ గిల్.. ఐ నో హౌ టు కిల్’ అంటూ షహ్నీల్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆగస్టు 13 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్న ఈ షోకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయంగా విజయవంతమైన ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్‌కు ఇది భారతీయ వెర్షన్. ఈ సీజన్‌లో మల్లికా షెరావత్, మునావర్ ఫరూఖి, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, పరుల్ గులాటి, దలిప్ తాహిల్, హర్మన్ సింఘా, తన్యా పురితో పాటు పాటు మొత్తం 21 మంది బాలీవుడ్ తారలు పాల్గొంటున్నారు. కాగా టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ‘లాక్ అప్’ రెండో సీజన్‌లో మెరిసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
2027 వన్డే ప్రపంచ కప్.. భువీని జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్
అవకాశాల కోసం వెంటపడని వ్యక్తి.. రహానె రిటైర్‌మెంట్‌పై సచిన్ పోస్ట్