Share News

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం

ABN , Publish Date - Jun 08 , 2026 | 03:25 PM

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌లో అఫ్గానిస్థాన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. అయితే టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం
India vs Afghanistan Test

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్‌లో అఫ్గానిస్థాన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. అయితే టెస్టుల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఫాలోఆన్‌లో సెదిఖుల్లా అటల్(42) టాప్ స్కోరర్. రహ్మనుల్లా గుర్బాజ్(24) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఫాలోఆన్‌లో భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, కుల్‌దీప్ యాదవ్ 3, మానవ్ సుతార్ 1 వికెట్ పడగొట్టారు.


టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ ప్రకటించింది. కేఎల్ రాహుల్(100), శుభ్‌మన్ గిల్(126) సెంచరీలతో అదరగొట్టారు. సాయి సుదర్శన్(81), రిషభ్ పంత్(81), వాషింగ్టన్ సుందర్(52*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ 152 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్రంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో.. అఫ్గాన్‌తో ఫాలోఆన్ ఆడించింది. ఫాలోఆన్‌లో కూడా అఫ్గాన్ బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. 112 పరుగులకే ఫాలోఆన్‌లో కుప్పకూలారు. దీంతో భారత్‌ టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించింది.


ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ ఏం చేస్తాడో.. నాకైతే డౌటే: ఏబీ డివిలియర్స్

విప్లవాత్మక మార్పులతో ఫీఫా వరల్డ్ కప్

Updated Date - Jun 08 , 2026 | 03:28 PM