Share News

మొనాకో గ్రాన్‌ప్రీ.. రియాల్టీ టీవీ స్టార్‌ను ముద్దాడిన హామిల్టన్

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:08 PM

ఫార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్డాషియన్‌ను చుంబించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మొనాకో గ్రాన్‌ప్రీ.. రియాల్టీ టీవీ స్టార్‌ను ముద్దాడిన హామిల్టన్
Lewis Hamilton

ఇంటర్న్‌ట్ డెస్క్: పార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈసారి మొనాకో గ్రాన్‌ప్రీలో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, రేసు ముగిసిన తరువాత అతడు రియాల్టీ టీవీ స్టార్‌ కిమ్ కర్డాషియన్‌ను ముద్దాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాము రిలేషన్‌లో ఉన్నట్టు అటు కిమ్ గానీ ఇటు హామిల్టన్ గానీ ఎప్పుడూ బయటపడలేదు. విలేకరుల ప్రశ్నలకు కేవలం చిరునవ్వులతో సమాధానం ఇస్తుంటారు. ఇప్పటికే వారు పలు ఈవెంట్స్‌కు కలిసి హాజరయ్యారు. ఈసారి రేసుకు వచ్చిన కిమ్ స్టాండ్స్‌లో నిలబడి హామిల్టన్‌ను ప్రోత్సహించింది.


ఇక రేసు ముగిసిన అనంతరం హామిల్టన్‌ను చుట్టుముట్టిన విలేకరులు కిమ్‌తో ఆయన రిలేషన్‌షిప్ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అంతటి హైప్రోఫైల్ సెలబ్రిటీ మీకు మద్దతుగా ఉండటంపై స్పందన ఏమిటని ప్రశ్నించారు. ‘ఆమె రావడం నిజంగా అద్భుతమే. ఇంత మంది మంచి ఫ్రెండ్స్ నా కోసం రావడం నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మంచి వ్యక్తులు నిత్యం చుట్టూ ఉండి ప్రోత్సహిస్తూ ఉంటే గొప్పగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ ఇంతే’ అని చెప్పాడు. నెం.2గా నిలిచాక ట్రోఫీ తీసుకున్న అనంతరం కిమ్‌కు హామిల్టన్ ఒక ఫ్లయ్యింగ్ కిస్ కూడా ఇచ్చాడు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న తరుణంలో మాత్రం సంశయాలన్నీ పక్కన పెట్టేసి కిమ్ బుగ్గపై కిస్ ఇచ్చాడు. దీంతో, వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టే అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


హామిల్టన్ ఇప్పటికే ఏడు సార్లు ఎఫ్-1 ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. ఇక ఫెర్రారీతో తన కాంట్రాక్ట్ 2027 వరకూ కొనసాగుతుందని కూడా చెప్పాడు. కొందరు తనను రిటైర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు మాత్రం అసలు ఆ ఆలోచనే లేదని చెప్పాడు.

ఈ వార్తలనూ చదవండి:

వైభవ్ ఏం చేస్తాడో.. నాకైతే డౌటే: ఏబీ డివిలియర్స్

విప్లవాత్మక మార్పులతో ఫీఫా వరల్డ్ కప్

Updated Date - Jun 08 , 2026 | 12:34 PM