Share News

విప్లవాత్మక మార్పులతో..

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:15 AM

ప్రతిష్ఠాత్మక ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ మరో మూడ్రోజుల్లో మొదలవనుంది. ఈసారి టోర్నీ విప్లవాత్మక మార్పులతో మన ముందుకొస్తోంది. ఆటలో మరింత పోటీతత్వం పెంచడంలో...

విప్లవాత్మక మార్పులతో..

ప్రతిష్ఠాత్మక ఫిఫా ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ మరో మూడ్రోజుల్లో మొదలవనుంది. ఈసారి టోర్నీ విప్లవాత్మక మార్పులతో మన ముందుకొస్తోంది. ఆటలో మరింత పోటీతత్వం పెంచడంలో భాగంగా సరికొత్త నిబంధనలను ఫిఫా రూపొందించింది. అవేంటంటే..

  • బంతి మైదానం నుంచి బయటికి వెళ్లాక ఆటగాళ్లకు దాన్ని లోపలికి విసిరేందుకు 5 సెకన్లకంటే ఎక్కువ సమయం ఉండదు. ఎవరైనా కావాలని రీస్టార్ట్‌ను ఆలస్యం చేస్తే ప్రత్యర్థి జట్టుకు త్రో-ఇన్‌ అవకాశం ఇస్తారు.

  • బంతిని తన్నడానికి లేదా పాస్‌ చేయడానికి గోల్‌ కీపర్‌కు కూడా కేవలం 5 సెకన్ల సమయమే ఉంటుంది. ఆలస్యం చేస్తే ప్రత్యర్థికి వెంటనే కార్నర్‌ కిక్‌ అవకాశమిస్తారు.

  • సైడ్‌లైన్‌ దగ్గర వైద్య చికిత్స తీసుకునేందుకు ఆటగాళ్లు వెళ్లి, తిరిగి రావడానికి నిమిషం సమయం తీసుకోవాల్సి ఉంటుంది.

  • వాగ్వాద సమయాల్లో ఆటగాళ్లెవరూ తమ నోళ్లను కవర్‌ చేసుకుని మాట్లాడడాన్ని అనుమతించరు. ఎవరైనా అలా చేస్తే రెడ్‌ కార్డుకు గురవుతారు. ఈ నిబంధనను వరల్డ్‌క్‌పనకే గాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో అమలు చేయనున్నారు. ఆటలో రేసిజం కట్టడి చేయడంలో భాగంగా ఈ నిబంధనను రూపొందించారు.

  • ఇక నుంచి ఆటగాళ్లకు ఆట ప్రథమార్ధం, ద్వితీయార్థాల్లో మూడు నిమిషాల చొప్పున హైడ్రేషన్‌ విరామం లభిస్తుంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 05:15 AM