Share News

‘జట్టు పరివర్తన’ అంటూ సాకులు చెప్పొద్దు: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Jun 08 , 2026 | 09:21 PM

భారత టెస్టు జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.

‘జట్టు పరివర్తన’ అంటూ సాకులు చెప్పొద్దు: సునీల్ గావస్కర్
Sunil Gavaskar, Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టెస్టు జట్టు.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సంగతి తెలిసిందే. టీ20, వన్డే ఫార్మాట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ.. టెస్టుల్లో మాత్రం స్వదేశంలోనే టీమిండియా విఫలమవుతూ వస్తోంది. అయితే యువ ప్లేయర్లు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుందని, జట్టు పరివర్తనా దశలో ఉందంటూ గంభీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనను టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కొట్టిపారేశాడు. ప్రధాన కోచ్ గంభీర్ అభిప్రాయానికి భిన్నంగా స్పందించాడు.


అఫ్గానిస్థాన్‌పై భారత్ 300 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో గావస్కర్ మాట్లాడాడు. ‘ప్రతి జట్టులోనూ ప్లేయర్లు రిటైర్ అవుతారు. కొత్తప్లేయర్లు వస్తారు. మార్పులు సహజం. కానీ ఎప్పుడూ జట్టు పరివర్తన దశలో ఉందనే మాట వెనుక దాక్కోవడం సరైంది కాదు. టెస్టు క్రికెట్‌లో ప్రదర్శనలే ముఖ్యం. భారత్ బౌలింగ్ విభాగం ఎక్కువ సందర్భాల్లో తన పని తాను చేసింది. కానీ బ్యాటర్లు మరింత క్రమశిక్షణ, మెరుగైన టెక్నిక్ ప్రదర్శించాలి. కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు టీ20 ఫార్మాట్‌ మైండ్‌సెట్‌తో ఆడుతున్నారు. కొన్ని డాట్ బాల్స్ వచ్చినా ఓపిక కోల్పోతున్నారు. టెస్టు క్రికెట్‌లో ఓపిక చాలా ముఖ్యం’ అని గావస్కర్ వెల్లడించాడు.


కాగా, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో ప్రస్తుతం భారత్ ఆరో స్థానంలో ఉంది. తొమ్మిది టెస్టుల్లో నాలుగు విజయాలే నమోదు చేసింది. త్వరలో శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ భారత్‌కు కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

అరంగేట్రంలోనే మానవ్ సుతార్ అరుదైన ఘనత

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?

Updated Date - Jun 08 , 2026 | 09:36 PM