• Home » Telugu News

Telugu News

నగరానికి క్రికెటర్లు

నగరానికి క్రికెటర్లు

స్థానిక ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరగనున్న వన్డే మ్యాచ్‌లో తలపడనున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు రాయ్‌పూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సిన బిల్లులు, ఆశీలు వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం జరగనున్న మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌కు హాజరయ్యేందుకుగాను గురువారం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌కు విమానాశ్రయంలో ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్‌ సేవలు

డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయాల (డీడీవో) ఏర్పాటు ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో పాలన మరింత మెరుగవుతుందని, ప్రజలకు సేవలు చేరువవుతాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అన్నారు.

ఉక్కుకు తొలగని చిక్కులు

ఉక్కుకు తొలగని చిక్కులు

స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడ-హైదరాబాద్‌ బోయింగ్‌ వైడ్‌-బాడీ విమానాలు

విజయవాడ-హైదరాబాద్‌ బోయింగ్‌ వైడ్‌-బాడీ విమానాలు

విజయవాడ విమానాశ్రయం నుంచి విజయవాడ-హైదరాబాద్‌ మధ్య వైడ్‌బాడీ విమానాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్‌ చేసిన కృషి ఫలించింది. ఢిల్లీలోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన నాయుడు కార్యాలయంలో గురువారం ఇండిగో ఫ్లైట్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ ఏకే సింగ్‌తో ఎంపీలు కేశినేని, జీఎం హరీశ్‌తో సమావేశం నిర్వహించారు.

ఇళ్ల అనుమతులు గగనమే..

ఇళ్ల అనుమతులు గగనమే..

కరీంనగర్‌లో ఇళ్లు కట్టుకోవడానికి నగరపాలక సంస్థను అనుమతులు పొందడం గగనమవుతోంది.

నిర్లక్ష్యపు సేవలపై సీరియస్‌

నిర్లక్ష్యపు సేవలపై సీరియస్‌

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ప్రక్షాళన మొదలైంది. భక్తులకు సరైన సేవలు అందకపోవడంపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు.. ఈవో కిశోర్‌కుమార్‌పై వేటు వేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్‌ క్యాడర్‌ కలిగిన మహేశ్వరరెడ్డిని నియమించారు. బుధవార ం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీజీఎస్‌ ద్వారా నిర్వహించిన సమీక్షలో పెనుగంచిప్రోలు దేవస్థానానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందట్లేదనే విషయం బయటపడటంతో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

రజకుల సమస్యల పరిష్కారానికి కృషి

రజకుల సమస్యల పరిష్కారానికి కృషి

రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి ప్రత్యేక కాలనీ ఏ ర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 16వ డివిజన్‌లో రూ.17.70 లక్షల వ్యయంతో చేపట్టిన గౌతమి దోబిఖాన ఆధు నీకరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఫ్లై ‘ఓవర్‌’

ఫ్లై ‘ఓవర్‌’

నిడమానూరు డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌కు జాతీయ రహదారుల సంస్థ మంగళం పాడేసింది. ఎన్‌హెచ్‌ విజయవాడ డివిజన్‌ అధికారులు పంపిన డీపీఆర్‌ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్‌) తిరస్కరించింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో నిడమానూరు ఫ్లై ఓవర్‌ అవసరం లేదని నిర్ణయించింది. ఈ కారణంగా ఆ ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు డీపీఆర్‌ను పంపడంలో జరిగిన జాప్యం, మెట్రోరైల్‌ కారిడార్‌తో లింకుపెట్టడం వంటి చర్యలు కాలాతీతానికి దారితీశాయి. ఈలోపు విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ తుదిదశకు చేరుకోవడంతో మోర్త్‌ తన ఆలోచనను మార్చుకుని ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి