కాల్వబుగ్గ హుండీ ఆదాయం రూ.5.52 లక్షలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:36 AM
మండలంలోని కాల్వ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది.
ఓర్వకల్లు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాల్వ బుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం దేవదాయశాఖ ఇన్సపెక్టర్ రమేష్, ఈవో మద్దిలేటి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. ఇందులో శాశ్వత హుండీ, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక హుండీ లెక్కింపులో మొత్తం రూ.5,52,410 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో శాశ్వత హుండీ లెక్కిం పులో రూ.4,50,404, అన్నదాన హుండీ రూ.20,886, తాత్కాళిక హుండీ రూ.81,120 ఆదాయం వచ్చిందని ఈవో మద్దిలేటి తెలి పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన కాటినేని నారాయణ, ధర్మకర్త కాకి దేవేంద్ర, భక్తులు గొల్ల నాగరాజు, రామగోవిందు, గువ్వ రవికుమార్, సేవకులు పాల్గొన్నారు.