Share News

నాటు ఘాటు..

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:45 AM

మండలంలోని గ్రామాల్లో సారా గుప్పుమంటోంది. కొలిమిగుండ్ల సమీపంలోని సిమెంట్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే టార్గెట్‌గా విక్రయదారులు సారాను అమ్ముతున్నారు.

నాటు ఘాటు..
చింతలాయపల్లె రహదారిలో బైకుపై తరలుతున్న సారా

విచ్చలవిడిగా సారా విక్రయాలు

ప్యాకెట్‌కు రూ.30 ప్రకారం..

సిమెంట్‌ పరిశ్రమల కార్మికులే టార్గెట్‌గా అమ్మకాలు

కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో సారా గుప్పుమంటోంది. కొలిమిగుండ్ల సమీపంలోని సిమెంట్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులే టార్గెట్‌గా విక్రయదారులు సారాను అమ్ముతున్నారు. ఇక్కడ దాడాపు 3వేల మందికి పైగానే కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో అధికభాగం బీహార్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

బైకుపై తరలింపు..

అవుకు మండలం కొండమీద పల్లెల్లో వీరు సారాను కాస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రోజూ బైకుల్లో సారా పాకెట్లను సంచుల్లో వేసుకుని కార్మికుల వద్దకు తెస్తున్నారు. ఇలా రోజుకు 2వేల ప్యాకెటల వరకు అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఇక్కడి నుంచి కడప జిల్లాకు సైతం సారా తరళి వెళుతోంది. ఈ సారా తాగినవారు తీవ్ర అనారోగ్యం పాలు కావడం, మృతి చెందే ప్రమాదాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయానికి పడుతోంది. సారాతోపాటు గంజాయి కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు దీన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:45 AM