Share News

దొంగల హల్‌చల్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:52 AM

మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో గురువారం రాత్రి 40 వ్యవసాయ బోరుబావుల కేబుళ్లు చోరీకి గురైనట్లు బాధిత రైతులు రఫి, మధు, రామక్రిష్ణ, వెంకటక్రిష్ణ, వెంకటరమణ వాపోయారు

దొంగల హల్‌చల్‌
బోరును చూపుతున్న రైతు

40 బోరుబావుల కేబుళ్ల చోరీ

లబోదిబోమంటున్న రైతులు

రుద్రవరం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో గురువారం రాత్రి 40 వ్యవసాయ బోరుబావుల కేబుళ్లు చోరీకి గురైనట్లు బాధిత రైతులు రఫి, మధు, రామక్రిష్ణ, వెంకటక్రిష్ణ, వెంకటరమణ వాపోయారు. శుక్రవారం ఉదయం ఆన్‌చేయడానికి వెళ్లగా కేబుళ్లు చోరీకిగురయ్యాయని గుర్తించామన్నారు. సుమారు 40 బోర్ల తీగెలను ఒకే రోజు రాత్రి చోరీక చేశారని, రూ.లక్ష రూపాయల మేర నష్టపోయారు.

నాలుగు బోర్ల కేబుళ్లు చోరీ

నాలుగు బోరుబావుల కేబుళ్ల చోరీకి గురయ్యాయి,. ఒక్కో బోరుబావుల వద్ద రూ.3వేల చొప్పున 12వేలు నష్టపోయా. రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. - రఫి, రైతు,. పెద్దకంబలూరు

Updated Date - Feb 21 , 2026 | 12:52 AM