Home » Telugu News
విశాఖ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను దారిమళ్లించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ, హేలాపురి కళాపరిషత్, ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నాలుగోరోజు మంగళవారం ఉత్సాహపరిచే వాతావరణంలో ముగిశాయి.
భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపడుతున్న ఓటరు జాబితాల స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ఎట్టకేలకు జిల్లాలో జోరందుకుంది. జూన్ 15న మొదలైన సర్ ప్రక్రియను ఈ నెల 14 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అయితే అనివార్య కారణాలతో జిల్లాలో మూడు రోజుల క్రితం వరకు కేవలం 44 శాతం మాత్రమే ఈ ప్రక్రియ పూర్తయింది.
అసలే అధ్వాన రహదారి.. దానికి తోడు ఇరువైపులా ఆక్రమించిన తుప్పలు. దీంతో రాకపోకలకు వాహనచోదకులకు తప్పని తిప్పలు.. ఇదీ మండలంలోని చింతలపూడి- చోద్యం రోడ్డు దుస్థితి. ఈ రహదారి నిర్మించి సుమారు 14 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయకపోవడంతో గోతులమయమై 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నల్లగొండ డివిజన్‌లోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇద్దరు ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం. నకిలీ ఈసీలపై ఇప్పటికే కేటాయించిన ఒరిజినల్ ఈసీల నంబర్లు వేసి ఇస్తున్నారని, సదరు నకిలీ ఈసీల డబ్బును వీరు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
భీమవరం పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది.
విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించిన ప్రభుత్వం.. పలు ప్రాథమిక పాఠశాలల్లో కనీసస్థాయిలో కూడా విద్యార్థులు లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించడంలేదు. సుమారు నెల రోజులపాటు ఉపాధ్యాయులు గ్రామాల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో అశించిన మేర విద్యార్థులు చేరలేదు. నూతన విద్యా విదానంలో భాగంగా చాలా వరకు ప్రాథమిక పాఠశాలలను ఒకటి, రెండు తరగతులకే పరిమితం చేయడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి.
దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్‌ఎస్ (ఎం)గా పనిచేస్తున్న జీకే పుష్పరాజ్‌ను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన (సర్)లో భాగంగా ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్న ఓటర్లు, వాటని పూరించి, ఫొటో అతికించి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తిచేశారు.