భీమవరంలో కారు బీభత్సం
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:23 AM
భీమవరం పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. నలుగురికి గాయాలు
తీవ్రంగా గాయపడిన గర్భిణి
భీమవరం క్రైం, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : భీమవరం పట్టణంలోని ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి పూలకుండీలను ఢీకొట్టి కారు ఆగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒక గర్భిణికి తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన సాగి రామకృష్ణరాజు ప్రస్తుతం భీమవరం మండలం చిన అమిరంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం పాలకొల్లు వైపు నుంచి భీమవరం వస్తుండగా ఓవర్ బ్రిడ్జిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం పూలకుండీలను ఢీకొట్టి కారు ఆగింది. లేకపోతే పెద్ద ప్రమాదమే చోటుచేసుకునేది. చికిత్స పొందుతున్నవారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.