ఎయిరిండియా విమానం మళ్లింపు
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:27 AM
విశాఖ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను దారిమళ్లించారు.
గోపాలపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):
విశాఖ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను దారిమళ్లించారు. మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖ రావాల్సి ఉంది. అయితే విశాఖ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానాన్ని విజయవాడ మళ్లించారు. తిరిగి 4.52 గంటల తరువాత ఈ విమానం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది.
12 మంది చిన్నారులకు పీఎం కేర్స్ సాయం విడుదల
విశాఖపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కరోనా వైరస్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 12 మంది చిన్నారులకు పీఎం కేర్స్ సాయం విడుదలైంది. పీఎం కేర్స్ (ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జన్సీ సిచ్యువేషన్) పథకానికి జిల్లాలో 12 మంది చిన్నారులను అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరికి ప్రతినెలా రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.1.44 లక్షలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. సదరు చిన్నారుల ఖాతాల్లో రెండు రోజుల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఆయా చిన్నారులు జిల్లాలో చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్స్‌లో ఉంటున్నారు.