Share News

జీజీహెచకు రోగులు క్యూ

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:22 AM

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి.

జీజీహెచకు రోగులు క్యూ
ఔషధశాల వద్ద మందుల కోసం బారులు దీరిన రోగులు

విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు

కర్నూలు హాస్పిటల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రోగులు క్యూ కట్టారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులతో ఆస్పత్రి కిటకిట లాడింది. వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దఎత్తున తరలివ చ్చారు. ఓపీ కేంద్రాల్లో వైద్యులు చికిత్స అందించారు. ఎక్కువగా రోగులు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతూ వస్తున్నారని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం మందుల కోసం రోగులు బారులు తీరారు. ఔషధశాల ఓపీ నెంబర్‌.13 వద్ద ఐదు క్యూలైన్లు రోడ్డు వరకు చేరారు. క్యూలైన్లలో నిలబడలేక గంటల తరబడి రోగు లు అవస్థలు పడ్డారు. ఫార్మాసిస్టులు కూడా మధాహ్నం 3గంటల వరకు రోగులకు మందులను పంపిణీ చేశారు.

Updated Date - Jul 08 , 2026 | 12:22 AM