Share News

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:21 AM

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌)లో భాగంగా ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్న ఓటర్లు, వాటని పూరించి, ఫొటో అతికించి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు విజ్ఞప్తిచేశారు.

ఫారాలను బీఎల్‌వోలకు అందించాలి
‘సర్‌’ ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన (సర్‌)లో భాగంగా ఎన్యుమరేషన ఫారాలను తీసుకున్న ఓటర్లు, వాటని పూరించి, ఫొటో అతికించి వెంటనే బీఎల్‌వోలకు అందించాలని నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు విజ్ఞప్తిచేశారు. మంగళవారం ఆయన చాకలి వీధి, కొత్తపేట రైతుబజార్‌ పరిసరాల్లోని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్యుమరేషన ఫారాలను 99శాతం పంపిణీ చేశామని, ఏ ఓట రుకైనా ఎన్యుమరేషన ఫారం ఇప్పటివరకు అందకపోతే సమీప సచివా లయంలో పొందాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా కూడ ఎన్యుమరేషన ఫారాన్ని ఆనలైనలో పూరించి సమర్పించొ చ్చని సూచించారు. ఆయన వెంట సూపర్‌వైజర్‌ జీఎం శ్రీకాంత, బీఎల్‌వోలు ఉన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:21 AM