• Home » Telugu News

Telugu News

 గ్రూపులు వద్దు.. కలిసికట్టుగా పనిచేయండి

గ్రూపులు వద్దు.. కలిసికట్టుగా పనిచేయండి

అలకలు వీడి పార్టీ కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

సమస్యల పరిష్కారానికి సానుకూలత

సమస్యల పరిష్కారానికి సానుకూలత

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ ఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఉదయానంద హోటల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.

దారి మారలేదు.. బాధ తీరలేదు!

దారి మారలేదు.. బాధ తీరలేదు!

roads problem in agency ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజన గ్రామాల్లో రహదారులు బాగు పడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు మంజూరు చేసినా గిరిజన గ్రామాల్లో రహదారుల పనులు పూర్తికాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌.. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు కనిపించరాదనే ఉద్దేశంతో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

పలాసను జిల్లాగా ప్రకటించాలి

పలాసను జిల్లాగా ప్రకటించాలి

పలాసను జిల్లాగా ప్రకటించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం రాత్రి స్థానిక ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌ రోడ్డులో అభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు, వివిధ ప్రజాసంఘాల గౌరవాధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టెక్కలి, పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని మండలాలను పలాసలో చేర్చి జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద న్నారు.

 స్థలాలు లేక.. పార్కింగ్‌కు బేజారు

స్థలాలు లేక.. పార్కింగ్‌కు బేజారు

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. స్థలాలు లేకపోవడంతో పార్కింగ్‌కు అగచాట్లు తప్పడం లేదు. వాహనాల సంఖ్యతోపాటు జనాభా పెరిగినారోడ్లు విస్తరించడంలేదు. ప్రస్తుత అవసరా లకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో రద్దీ పెరిగితే ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

గొర్రెలమందపై మళ్లీ కుక్కల దాడి

గొర్రెలమందపై మళ్లీ కుక్కల దాడి

Five goats die in Konchada పొందూరు మండలం కొంచాడలో కుక్కల దాడులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 2న కురమాన రమణ, గౌరునాయుడుకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా.. 42 గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరోసారి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి.

పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం

పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం

పరిశ్రమల్లో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ తుహిన్‌సిన్హా సూచించారు. ఫార్మాసిటీలోని మాన్‌కైండ్‌ ఫార్మా పరిశ్రమను గురువారం ఆయన సందర్శించారు.

 విద్యను నిర్లక్ష్యం చేయరాదు: కలెక్టర్‌

విద్యను నిర్లక్ష్యం చేయరాదు: కలెక్టర్‌

విద్యను నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. గురువారం శ్రీకాకుళం రిమ్స్‌ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో పెస్ట్‌ సంగ్యాన్‌ వార్షిక సంబరాలు ముగిశాయి.

వ్యసనాలకు బానిసై.. దొంగలుగా మారి

వ్యసనాలకు బానిసై.. దొంగలుగా మారి

Three arrested for theft ఆ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసై.. వేర్వేరుగా చోరీల బాట పట్టారు. ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అక్కడ ముగ్గురూ స్నేహితులయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. కొన్నాళ్లుగా ముగ్గురూ కలిసి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ.. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులకు చిక్కారు.

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

ఆదోని జిల్లా.. ప్రజల ఆకాంక్ష.!

‘ఆదోని జిల్లా అనేది.. పశ్చిమప్రాంత ప్రజల ఆకాంక్ష. జిల్లాల పునర్విభజనలో ఆదోని ప్రస్థావన లేకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి