Home » Telugu Desam Party
పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో జనసేన నాయకురాలు రజినీ, తెలుగుదేశం నేతలు ఇవాళ(గురవారం) సింగయ్య మృతికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ గుర్తు ఉందని, తప్పకుండా అమలు చేసి తీరుతామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రూ. 240 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బోండా ఉమ పేర్కొన్నారు.
జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే చేసి చూపించామని తెలుగుదేశం ఎంపీ బైరెడ్డి శబరి ఉద్ఘాటించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పేదరికాన్ని పారద్రోలేలా మార్గదర్శకుల సహకారంతో పీ4ను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్‌ది అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్‌కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) గుత్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ అబద్దపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని.. వారిని ఎందుకు జగన్ రెడ్డి పరామర్శించ లేదని దేవినేని ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు.